తమిళ స్టార్ విక్రమ్ సినిమాలు తరుచూ ఆలస్యమవుతూ ఉంటాయి. ఆయన ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ల టైమ్ తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటికీ విక్రమ్ సినిమాలు కొన్ని ఎప్పుడో అనౌన్స్ చేసి ఇంకా షూటింగ్ మొదలు కానివీ ఉన్నాయి, షూటింగ్ సా..గుతున్నవీ ఉన్నాయి. అలాంటి వాటిలో సూర్యపుత్ర కర్ణ కూడా ఒకటి.

2017లో దర్శక నిర్మాత జీఆర్ఎస్ విమల్ ..విక్రమ్ హీరోగా సూర్య పుత్ర కర్ణ సినిమాను అనౌన్స్ చేశారు. కొద్ది రోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత అనేక కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. మళ్లీ స్టార్ట్ చేద్దామంటే ఫైనాన్స్ కష్టాలు వచ్చిపడ్డాయి. దీంతో దర్శకుడు విమల్…ఓ ప్లాన్ వేశాడు. ఆ కొద్ది రోజుల షూటింగ్ ఫుటేజ్ నుంచి సీన్స్ కట్ చేసి టీజర్ రిలీజ్ చేశాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నామని ప్రకటించాడు.

అయితే హీరో విక్రమ్ ఈ టీజర్ గురించి స్పందించడం లేదు. కనీసం తన సోషల్ మీడియా అక్కౌంట్స్ లో పోస్ట్ చేయడం లేదు. అంటే సూర్య పుత్ర కర్ణ సినిమాపై తనకు ఆసక్తి లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసినట్లే. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో యుద్ధ రంగంలో కర్ణుడు శత్రు సేనపై బాణాలు గురిపెట్టినట్లు చూపించారు. సైనికులు, ఏనుగులు, గుర్రాలతో కదనరంగం భారీ హంగులతో కనిపించింది. టీజర్ ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. ఇంత గ్రాండియర్ గా మొదలుపెట్టిన సినిమాను ఎందుకు ఆపాల్సివచ్చిందో తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *