షారుఖ్ హీరోగా నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డ్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజైన 19 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 1004.92 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ ఫీట్ చేసిన గత సినిమాలు దంగల్, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, పఠాన్ కంటే దాదాపు వారం రోజుల ముందుగానే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ ఫీట్ సాధించింది జవాన్.

రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ ఈ నెల 7న రిలీజైంది. ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నిన్నటికి బాలీవుడ్ లో 500 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇవాళ్టికి గ్లోబల్ గా వెయ్యి కోట్ల ఫీట్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాలు ఇప్పటిదాకా ఆరు ఉండగా..వాటిలో రెండు సినిమాలు పఠాన్, జవాన్ షారుఖ్ వే కావడం విశేషం. ఇలా రెండు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల సినిమాలు ఖాతాలో వేసుకున్న ఏకైక స్టార్ హీరో షారుఖ్ నే. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే రిలీజ్ కావడం మరో హైలైట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *