అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా మిషన్ రాణిగంజ్. ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించింది. గతంలో క్యాప్సూల్ గిల్ అనే పేరున్న ఈ సినిమాను మిషన్ రాణిగంజ్ గా మార్చారు. వెస్ట్ బెంగాల్ లోని రాణిగంజ్ బొగ్గు గని ప్రమాదంలో 65 మంది కార్మికులను కాపాడిన మైనింగ్ ఇంజినీర్ జశ్వంత్ సింగ్ గిల్ జీవిత కథతో ఈ సినిమాను దర్శకుడు టిను సురేష్ దేశాయ్ రూపొందించారు. అక్టోబర్ 6న రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..

వెస్ట్ బెంగాల్ లోని రాణిగంజ్ కోల్ మైన్ లో రోజు లాగే కార్మికులు గనిలో పనిచేస్తున్నారు. పైన నది నుంచి నీరు అండర్ గ్రౌండ్ గనిలోకి లీక్ అవుతుంది. కార్మికులు నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో కేకలు వేస్తుంటారు. వారు పూర్తిగా మునిగిపోవడానికి కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తారు. బయట కార్మికుల కుటుంబాలు గొడవలు చేస్తుంటాయి. ఈ టైమ్ లో వారిని కాపాడేందుకు వస్తాడు మైనింగ్ ఇంజినీర్ జశ్వంత్ సింగ్ గిల్. తన ప్రతిభ, అనుభవంతో గని నుంచి కార్మికులను రక్షించే చర్యలు చేపడతాడు. ఈ క్రమంలో పరిస్థితి అర్థం చేసుకోలేక ఆగ్రహంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆయనను కొడతారు. తానే స్వయంగా గనిలోకి వెళ్లి 65 మంది కార్మికులు జలసమాధి కాకుండా కాపాడతాడు గిల్. ఈ ఆపరేషన్ మొత్తాన్ని ఎంతో ఎమోషనల్ గా, థ్రిల్లింగ్ గా చూపించింది ట్రైలర్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *