బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా వెడ్డింగ్ లైఫ్ లోకి అడుగుపెట్టింది. ఆమ్ ఆద్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి వివాహం నిన్న రాత్రి రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. ఉదయ్ పూర్ లోని ప్రఖ్యాత లేక్ ప్యాలెస్ లో జరిగిన వీరి పెళ్లికి ఇరు కుటంబ సభ్యులు ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్నేహితులు హాజరయ్యారు. చండీగఢ్ లో పరిణీతి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.

తాజాగా వీరి పెళ్లి ఫొటోలను షేర్ చేశారు వరుడు రాఘవ్ చద్దా. పరిణీతి, తాను ఎప్పటి నుంచో ఇలాంటి రోజు కోసం వేచి చూస్తున్నామని, ఒకరిని ఒకరు విడిచి ఉండలేమంటూ క్యాప్షన్ రాశాడు. ఇక ఇప్పటి నుంచి తాము భార్యా భర్తలమని సంతోషంగా వెల్లడించారు. రాఘవ్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్స్ కంగ్రాట్స్ అంటూ విశెస్ తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *