నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ప్రమోషన్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయడం, మాత్ టౌక్ బాగా స్ప్రెడ్ అవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్డడీగా రన్ కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా మరో మైల్ స్టోన్ కు చేరుకుంది. బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను గతంలో ఏ సినిమాకు లేనంతగా టాలీవుడ్ సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు. ఒక మంచి ప్రయత్నాన్ని వాళ్లంతా అభినందించారు. స్టార్స్ ఈ సినిమా చూడటమే కాదు ఆడియెన్స్ ను చూడమని పోస్ట్ లు చేశారు. ఇలా అందరి సహకారంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *