మహేశ్ బాబు పోకిరి సినిమా టాలీవుడ్ లో ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమా అప్పటికున్న టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. ఈ సినిమా హిట్ తో మహేశ్ తో పాటు హీరోయిన్ ఇలియానాకు మంచి పేరొచ్చింది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే ఈ ఛాన్స్ ఇలియానా కంటే ముందు బాలీవుడ్ హీరోయన్ కంగనా రనౌత్ కు వచ్చిందట. రీసెంట్ గా తన చంద్రముఖి 2 సినిమా ఇంటర్వ్యూస్ లో కంగనా ఈ విషయాన్ని వెల్లడించింది.

పోకిరి కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోయిన్ గా ఫస్ట్ కంగనా రనౌత్ ను అప్రోచ్ అయ్యారట. అయితే అప్పటికే ఆమెకు బాలీవుడ్ లో ఓ సినిమా ఉండటంతో డేట్స్ ఈ రెండు సినిమాలకు క్లాష్ అయ్యాయి. బాలీవుడ్ లో కెరీర్ ముఖ్యమనుకున్న కంగనా పోకిరిని వదిలేసింది. దాంతో ఆ అవకాశం ఇలియానాకు దక్కింది.

ఇది జరిగిన కొన్నాళ్లకు ప్రభాస్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఏక్ నిరంజన్ లో హీరోయిన్ గా నటించింది కంగనా. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయి అక్కడే సెటిలైంది. టాలీవుడ్ తో తనకున్న రిలేషన్ ను చంద్రముఖి 2 ప్రమోషన్స్ సందర్భంగా చెప్పుకుందీ బాలీవుడ్ హీరోయిన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *