కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తనను పావుగా వాడుకుంటున్నారని అంటోంది హీరోయిన్ పూనమ్ కౌర్. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన దాన్ని కాదని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నంత మాత్రాన తాను పొలిటికల్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని పూనమ్ చెబుతోంది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

అందులో పూనమ్ స్పందిస్తూ – చేనేత కార్మికుల, కళాకారుల సంక్షేమం కోసం దే‌శవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాను. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులను కలుస్తున్నాను. మహిళా సమస్యల మీద కూడా పోరాటం చేస్తున్నాను. అయితే కొందరు రాజకీయ నాయకులు నన్ను పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని నాపై సానుభూతి చూపిస్తూ దగ్గరవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే నాకు వారి సానుభూతి అవసరం లేదు. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. సామాజిక కార్యకర్తగా చేనేత, మహిళ డెవలప్ మెంట్ కోసం ప్రయత్నిస్తా అని పేర్కొంది.

మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్.. హీరోయిన్ గా స్టార్ కాలేకపోయింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ శౌర్యం వంటి చిత్రాల్లో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *