రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏళ్లుగా కొనసాగడమే ఈ ఎదురుచూపులకు కారణం. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కొందరు ఆర్టిస్టుల డేట్స్ అందుబాటులో లేనందున సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు..మళ్లీ అక్టోబర్ సెకండ్ వీక్ లో చిత్రీకరణ ప్రారంభిస్తామని ప్రొడక్షన్ హౌస్ తెలిపింది.

ఒక్కసారి గేమ్ ఛేంజర్ సినిమా టైమ్ లైన్ చూస్తే..2021 ఫిబ్రవరి 12న గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 8న అన్నపూర్ణ స్డూడియోస్ లో చిరంజీవి, రాజమౌళి, రన్వీర్ సింగ్ తదితరులు అతిథులుగా గ్రాండ్ గా ముహూర్తం షాట్ చేశారు. అక్టోబర్ 22న ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. నవంబర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇక అక్కడి నుంచి 2022 సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ పూర్తయ్యాయి. అయినా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలియడం లేదు. కనీసం రిలీజ్ డేట్ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

దర్శకుడు శంకర్ షూటింగ్ లో చాలా డీటెయిలింగ్ గా వెళ్లడమే ఆలస్యానికి కారణంగా ఈ షూట్ లో పాల్గొన్న ఆర్టిస్టులు చెబుతున్నారు. తనకు కావాల్సిన సెటప్ అంతా సెట్ లోకి వచ్చేదాకా పట్టుదలగా శంకర్ ఉంటున్నారని వారు అంటున్నారు. వచ్చే సమ్మర్ కల్లా గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తవుతుందని కొత్త టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *