హీరోయిన్స్ సినిమాలు ఒకరికి మరొకరికి రావడం సహజంగా జరిగేదే. అన్ని భాషల్లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్స్ తమ డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేక ప్రాజెక్స్ట్ తారుమారు అవుతుంటాయి. అలా నితిన్ పెయిర్ గా రశ్మిక మందన్న చేయాల్సిన సినిమా శ్రీలీలకు రాగా..ఇప్పుడు శ్రీలీలను అనుకుంటున్న ప్రాజెక్ట్ రశ్మిక ఖాతాలో పడింది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ కొత్త సినిమాలో హీరోయిన్ గా రశ్మికను తీసుకోబోతున్నారట.

రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ మాస్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీలీలను అనుకోగా..ఇప్పుడా ఛాయిస్ రశ్మికకు దక్కినట్లు తెలుస్తోంది. రశ్మిక మైత్రీ సంస్థలో డియర్ కామ్రేడ్, పుష్ప లాంటి మూవీస్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 లోనూ నటిస్తోంది. ఈ జర్నీతో తమ కొత్త సినిమాలో రశ్మికనే తీసుకోవాలని మైత్రీ సంస్థ భావిస్తోందట. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రణ్ బీర్ తో కలిసి నటించిన యానిమల్ రిలీజ్ కోసం వేచి చూస్తోంది రశ్మిక.

బలుపు, డాన్ శీను, క్రాక్ తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రమిది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *