వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జున మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఎస్వీసీసీ సంస్థలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమా గత నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చి ప్రొడ్యూసర్స్ కు నష్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ నెల 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో గాండీవధారి అర్జున సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల థియేటర్స్ లో ఆదరణ పొందని సినిమాలు కూడా ఓటీటీలో నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఓటీటీలో తమ సినిమాకు రెస్పాన్స్ బాగుంటుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ తో వరుణ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *