శర్వానంద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ విషయం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా..ఇవాళ అఫీషియల్ గా ఆమే హీరోయిన్ అని ప్రకటించారు. కృతి బర్త్ డే కాబట్టి స్పెషల్ పోస్టర్ తో పాటు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆమెకు ఇదొక క్రూషియల్ ఆఫర్ అనుకోవచ్చు.

ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన కృతి శెట్టి..ఆ సినిమా వందకోట్ల రూపాయల వసూళ్లను సాధించి సూపర్ హిట్ అవడంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. అప్పటికి కాజల్, తమన్నా, అనుష్క క్రేజ్ తగ్గడంతో యంగ్ హీరోస్ కు మంచి జోడీగా మారింది కృతిశెట్టి. ఆమె అందం, సక్సెస్ ఇండస్ట్రీని ఆకర్షించాయి. వరుసగా నాని, నితిన్, రామ్, నాగ చైతన్య , సుధీర్ బాబు వంటి హీరోలతో సినిమాలు దక్కాయి.

అయితే ఆమె నటించిన బంగర్రాజు, మాచర్ల నియోజకవర్గం, శ్యామ్ సింగరాయ్, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి మూవీస్ అన్నీ ఒక్కొక్కటిగా ఫ్లాప్ కావడంతో కృతి కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. శ్రీలీల ఎంట్రీ, మరోవైపు రశ్మిక దూకుడు కృతిని అంతా మర్చిపోయేలా చేశాయి. ఇలాంటి హార్డ్ టైమ్ లో శర్వానంద్ సినిమా కృతికి దక్కింది. ఇది టాలీవుడ్ లో ఆమె అదృష్టానికి లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *