ఏమైనా బాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ వేరు…వాళ్ల సినిమాల రీచ్ వేరు. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలన్నీ హిందీ సినిమాలను బాగా చూడటం, ఓవర్సీస్ లో ఎన్ఆర్ఐ ప్రేక్షకుల ఆదరణ కలిసి హిందీ సినిమాలకు రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంటాయి. తాజాగా షారుఖ్ జవాన్ సినిమానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా రిలీజైన సెకండ్ వీక్ లోనే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వైపు పరుగులు పెట్టడం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్ట్రెంత్ చూపిస్తోంది.

జవాన్ బాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల మార్క వైపు పరుగులు పెడుతుంటే..గ్లోబల్ గా చూస్తే 900 కోట్ల రూపాయలను దాటేసింది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ మైల్ స్టోన్ కు కొద్ది దూరంలో ఉందీ సినిమా. జవాన్ వెయ్యి కోట్ల గ్రాస్ ఉఫ్ అని ఊదేయడం 30 ఏళ్లుగా ఏమాత్రం తగ్గని షారుఖ్ స్టార్ డమ్ ను చూపిస్తోంది.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో జవాన్ ను నిర్మించాడు. నయనతార, దీపిక, ప్రియమణి, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 7న రిలీజైన జవాన్ బాక్సాఫీస్ దగ్గర రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *