ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాల ఘన విజయాల తర్వాత…‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో హ్యాట్రిక్ సూపర్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అనుష్క శెట్టితో కలిసి ఆయన నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధించింది. థర్డ్ వీక్ లోనూ గ్లోబల్ గా స్టడీ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. ఆడియెన్స్ లవ్ తో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా అప్రిషియేషన్స్ ఈ మూవీకి దక్కాయి. ఈ నేపథ్యంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సక్సెస్ తనకు అందించిన హ్యాపీనెస్ గురించి మీడియాతో మాట్లాడారు హీరో నవీన్ పోలిశెట్టి.

మేము చేసిన మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. ఇప్పటిదాకా నాకు దక్కిన మూడు సక్సెస్ ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్ కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నా.

మాస్ కమర్షియల్ సినిమా అయితే ఆడియెన్స్ అలవాటు పడి ఉంటారు కాబట్టి వెళ్తారు. మేము కొత్త సెన్సిటివ్ పాయింట్ చెప్పాం. దాంతో మెల్లిగా మా మూవీ జర్నీ మొదలైంది. స్టడీగా వెళ్తోంది. నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా.

ప్రతి మూవీ సక్సెస్ నాపై హీరోగా బాధ్యత పెంచుతుంటుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. నెక్ట్ ఇయర్ మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే. టైమ్ దొరికితే కపిల్ షో లాంటి మంచి హ్యూమరస్ టీవీ ప్రోగ్రాం చేయడానికి రెడీ. అయితే సినిమాలతోనే టైమ్ సరిపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *