యాక్టర్ జగపతి బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. రకరకాల ఫొటో షూట్స్ చేస్తూ వాటిని తన అక్కౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. వీటికి వస్తున్న రెస్పాన్స్ ఆయనలో మరింత ఉత్సాహం తెస్తోంది. దీంతో మరింత వెరైటీగా రెడీ అవుతూ తన ఫోటోస్ షేర్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఇన్ స్టాలో పింక్ డ్రెస్ లో యంగ్ లుక్ తో పోస్ట్ చేసిన జగపతి బాబు..కొద్ది సేపటికి ట్విట్టర్ లో ఫేస్ మాస్క్ వేసుకుని ఉన్న ఫొటో పెట్టాడు.

ఈ పోస్టులో జగపతి స్పందిస్తూ – ఇందాక ఇన్ స్టాలో పెట్టిన నా పింక్ డ్రెస్ ఫొటో చూసి మీరంతా కుర్రాడిలా అవుతున్నారు అని అనగానే…సంతోషంలో నిజంగానే కుర్రాడిని అయిపోవాలని రెడీ అవుతున్నా..అంటూ క్యాప్షన్ రాశారు. లెజెండ్ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు..ఆ తర్వాత తెలుగులో ఫుల్ బిజీ అయ్యారు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలోనూ రెగ్యులర్ గా మూవీస్ చేస్తున్నారు. నటుడిగా తనకు ఇంత క్రేజ్ రావడం పట్ల హ్యాపీగా ఉన్న జగపతి తన సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *