దిగ్గజ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి కార్యక్రమంలో మహేశ్ బాబు, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కినేని కుటుంబ సభ్యులు నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్, సుమంత్ తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ విగ్రహానికి రామ్ చరణ్, మహేశ్ నివాళులు అర్పించారు. తమ ఇంటి కార్యక్రమానికి వచ్చిన మహేశ్ బాబు, రామ్ చరణ్ కు నాగార్జున థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు ఏఎన్నార్ లివ్స్ ఆన్ ఆనే యాష్ ట్యాగ్ ను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో జరిగిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *