డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నవదీప్ కూడా ఉన్నారు. ఆయన డ్రగ్స్ వాడినట్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. పోలీసులు తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చడంతో కోర్టుకు వెళ్లారు నవదీప్. తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించారు.

అయితే ఇవాళ నవదీప్ బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు దాన్ని కొట్టివేసింది. పోలీసుల విచారణకు నవదీప్ సహకరించాలంటూ కోర్టు తన తీర్పులో పేర్కొంది. పోలీసులు నవదీప్ ను విచారించవచ్చని సూచించింది. కోర్టు తీర్పుతో పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో స్పీడ్ పెంచారు. 41ఏ నోటీస్ ఇచ్చి నవదీప్ ను విచారించబోతున్నారు. నవదీప్ తమకు సహకరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ తో పాటు మరికొందరికి నోటీసులు ఇవ్వబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *