స్టార్ హీరో ఎన్టీఆర్ ఇటీవల సైమాలో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కోసం దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్..రీసెంట్ గా హైదరాబాద్ తిరిగి వచ్చారు. రాగానే తన కొత్త సినిమా దేవర షూటింగ్ లో అడుగుపెట్టారు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు ఇతర కీ కాస్టింగ్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ్టి నుంచి మొదలైన దేవర కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొంటున్నారు. సినిమాలో చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అయిన ఈ యాక్షన్ సీక్వెన్సులకు రియల్ ఫుటేజ్ తో పాటు సీజీ వర్క్ కూడా జోడించబోతున్నారు. దీంతో యాక్షన్ కు సరికొత్త ఎఫెక్ట్ లు తీసుకురానున్నారు.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తం నిర్మాణంలో దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *