సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ టాలెంటెడ్ హీరోయిన్స్. ఇద్దరూ మంచి పర్ ఫార్మర్స్. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలంటే దర్శకులు వీరిద్దరి రిఫర్ చేస్తుంటారు. అలాంటి సాయి పల్లవి, కీర్తి సురేష్ ఒకరి సినిమాలను మరొకరు ఎగరేసుకు పోయే సందర్భాలు ఇప్పటిదాకా రాలేదు. కానీ ఇప్పుడొక సినిమా ఆ సీన్ తీసుకొచ్చింది. అదే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీ.

ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నట్లు తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కీర్తి సురేష్ ను అనుకున్నారట. దసరా సినిమాలో వెన్నెల క్యారెక్టర్ ద్వారా రూరల్ క్యారెక్టర్స్ లో ఆకట్టుకోగలదు అని ప్రూవ్ చేసుకుంది. దసరా సినిమాలో కీర్తి క్యారెక్టర్ ఒక ఫిల్లర్ గా నిలిచింది. దీంతో సాయి పల్లవి కంటే కీర్తినే నాగ చైతన్య మూవీకి తీసుకోవాలని అనుకున్నారట.

చివరగా అనుకోని కారణాలతో ఈ సినిమా సాయి పల్లవి దగ్గరకు వెళ్లింది. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరిలో నటించడం కూడా ఈ పెయిర్ వైపు మేకర్స్ డెసిషన్ తీసుకునేందుకు ఓ కారణమైంది. మొత్తానికి కీర్తి సినిమా సాయి పల్లవి ఖాతాలో పడినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *