డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ పొలిటికల్ టూర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆటంకాల మధ్య కూడా ఈ సినిమా సగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పోస్ట్ కు దర్శకుడు హరీశ్ స్పందించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికే 50 పూర్తయిందట కదా అన్న..ఇక సినిమా క్వాలిటీ భారం ఆ దేవుడు మీదే వేశాం.అని ట్వీట్ చేయగా…డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందిస్తూ..అంతే కదా తమ్ముడు అంతకు మించి నువ్వు ఏం చేయగలవు? ఈలోగా కాస్త స్టడీస్, జాబ్, కెరీర్ మీద దృష్టి పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు. ఆల్ ది బెస్ట్ అని రిప్లై ఇచ్చాడు.

మరో ఫ్యాన్.. కెరీర్ పోతే పోనీ అన్నా..ఉస్తాద్ మాకు ముఖ్యం. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇవ్వు అని అడిగారు. హరీశ్ రిప్లై ఇస్తూ..నా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తా అని పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీశ్ శంకర్ ఇచ్చిన ఈ రిప్లై ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగింది. ఫైటర్స్ తో పవన్ పాల్గొన్న భారీ ఫైట్ సీక్వెన్సులు చిత్రీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *