చిరంజీవి హీరోగా ఇటీవల మెగా 156, మెగా 157 అనే రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించాడు. వీటిలో చిరంజీవి 156వ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత తన ప్రొడక్షన్ లో నిర్మించాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మెగా156 ప్రాజెక్ట్ ఉండదని అంటున్నారు.

ఈ సినిమాకు ముందుగా ఒక రీమేక్ కథను అనుకున్నారు. అయితే ఇటీవల భోళా శంకర్ సినిమా చిరంజీవికి చాలా బ్యాడ్ చేసింది. దీంతో ఇక రీమేక్ లు వద్దు అని ఆయన ఫిక్స్ అయ్యారు. ఒక కొత్త కథనే తయారుచేసుకోమ్మని కల్యాణ్ కృష్ణకు చెప్పారట. చిరు మాటతో కొత్త స్టోరి సిద్ధం చేసే పనిలో పడ్డారు కల్యాణ్ కృష్ణ.

అనుకున్న టైమ్ కు స్టోరి రెడీ కాకపోవడంతో ముందు మెగా157 మూవీ చేసి ఆ తర్వాత ఈ సినిమా గురించి చూద్దాం అనే ఆలోచలనలో ఉన్నారట చిరంజీవి. దీంతో ప్రస్తుతానికి 156వ సినిమా లేనట్లే అనుకోవాలి. చిరంజీవి పూర్తిగా 157 మూవీ మీదే దృష్టి పెట్టబోతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి మరొక లేటెస్ట్ న్యూస్ వినిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *