కంటెంట్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసే హీరోయిన్స్ పేర్లు చెబితే ఆ లిస్టులో గుర్తొస్తుంది నిత్యామీనన్. తన టాలెంటెడ్ పర్ పార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ మలయాళ తార. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద నిత్యా మీనన్ మరోసారి ఇలాంటి వెరైటీ అటెంప్ట్ చేస్తోంది. ఆ సిరీస్ పేరే కుమారి శ్రీమతి. వైజయంతీ మూవీస్ వెబ్ విభాగం ఎర్లీ మాన్స్ సూన్ టేల్స్ ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేసింది. అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించి క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. గోమ్ టేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించిన కుమారి శ్రీమతి టీజర్ ఇవాళ రిలీజైంది. ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

అదొక పల్లెటూరి. ఆ ఊరిలో అందమైన అమ్మాయి సిరికి పెళ్లంటే ఇష్టం ఉండదు. తన స్నేహితురాలితో కలిసి ఊరిలోనే బిజినెస్ చేస్తుంటుంది. అమెరికా సంబంధం వచ్చినా, ఢిల్లీ సంబంధం వచ్చినా కాదంటుంది కుమారి. అడిగితే ఆన్సర్ చెప్పదు. మరి ఇలాంటి కుమారి శ్రీమతి ఎలా అయ్యింది అనే ప్రశ్నతో టీజర్ ఆసక్తికరంగా ముగుస్తుంది.

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో ఆహ్లాదకరమైన పల్లె వాతావరణం, పాత్రలు, కథలో చిన్న ట్విస్ట్ ఉన్నట్లు టీజర్ తో తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి కుమారి శ్రీమతి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *