సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమాకు మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. తమిళంలో యోగి బాబు నటించిన మండేలా సినిమాకు ఇది తెలుగు రీమేక్. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ ద్వారా పంపిణీ కాబోతున్న మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఎన్నికల టైమ్ లో సాధారణ ఓటరు రాచమర్యాదలు అందుకుంటాడు. అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని ఓటరు ..ఎన్నికల రోజు దేవుడు అవుతాడు. అతనికి ఎలక్షన్ టైమ్ లో రాజకీయ నాయకులు ఎప్పుడూ లేనంత గౌరవిస్తారు. ఇలా అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని ఒక మంగళి యువకుడు..ఎలక్షన్ టైమ్ లో నాయకుల రాచమర్యాదలు ఎలా పొందాడు. చివరకు తన ఓటును ఎవరికి వేశాడు అనేది ఈ సినిమా కథ. ఒక ఊరిలో జరిగే ఈ కథలో అనేక భావోద్వేగాలతో పాటు పల్లె వాతావరణం, అక్కడి పాత్రలు ఆకట్టుకుంటాయి. తమిళ నేటివిటీ ఉండే ఈ సినిమాను తెలుగు రీమేక్ లో మనకు నచ్చేలా రూపొందించామని మూవీ టీమ్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *