పురాణాల్లో దేవుళ్లదే విజయం…మన సినిమాల్లో హీరోలే గెలుస్తుంటారు…అలా కాదని కొత్త చరిత్రను రాస్తే…గెలుపు రాక్షసులదే..సినిమాలో సక్సెస్ అయ్యేది ప్రతి నాయకులే. విలన్స్ గెలవాలి అనే కాన్పెస్ట్ ను మైథాలజీలోని ఓ అంశాన్ని కనెక్ట్ చేస్తూ దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించిన సినిమా రాక్షస కావ్యం. ఈ చిత్రంలో అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా తాజాగా “రాక్షస కావ్యం” ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

నువ్వు చదువుకుంటే మనలాంటి వందమందికి చదువు చెప్పొచ్చురా అని కొడుక్కు చెబుతుంది తల్లి. కానీ ఆ తండ్రి తన తాగుడు కోసం కొడుకును పనిలో పెడతాడు. అక్కడే ఆ పిల్లాడి మనసులో సంఘర్షణ మొదలవుతుంది. హీరోల కంటే విలన్లనే ఎక్కువగా ఇష్టపడతాడు. విలన్స్ గెలవాలి అనుకుంటాడు. తను చేసే సినిమాలో హీరోను విలన్ చంపేసి హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం క్లైమాక్స్ అని చెబుతాడు అన్వేష్. అన్నా దమ్ములుగా అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్ కనిపించారు. అభయ్ ది రౌడీ క్యారెక్టర్. తండ్రీ, తమ్ముడు అని కూడా చూడకుండా కొడుతుంటాడు. అతనికో లవ్ స్టోరి ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తే చంపేయమని తన గ్యాంగ్ కు చెబుతాడు. మదర్ సెంటిమెంట్, బ్రదర్స్ మధ్య రిలేషన్, మైథాలజీలోని ఇన్స్పిరేషన్ తో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రాక్షస కావ్యం సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. షాట్ మేకింగ్, బీజీఎం, సినిమాటోగ్రఫీ, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *