కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ హీరోయిన్ అషికా రంగనాథ్. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నా..ఆషికాకు మంచి గుర్తింపు దక్కింది. అమిగోస్ తర్వాత టాలీవుడ్ లో ఆఫర్స్ కోసం వేచి చూస్తోంది ఆషికా. ఆమె ఎదురుచూసినట్లే ఓ మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామి రంగ సినిమాలో నాయికగా ఆషికాను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ముందుగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నా…ఛేెంజెస్ జరుగుతున్నాయి. కాజల్ స్థానంలో ఆషికా రంగనాథ్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో టీమ్ ఉన్నారు. కాజల్ ఔట్ డేటెడ్ హీరోయిన్ అనీ, సినిమాకు ఫ్రెష్ నెస్ రాదని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఆషికాకే లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ లో నా సామి రంగ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *