విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా సినిమా నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేసి..దాంతో పాటే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. డిసెంబర్ 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు కృష్ణ చైతన్య రూపొందిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

గోదావరి జిల్లాల్లో సాగే పొలిటికల్ నేపథ్యంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. విలేజ్ లో మాస్ రగ్డ్ కుర్రాడి క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఇదే రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నాని హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల నుంచి బాక్సాఫీస్ పోటీని ఎదుర్కోనుంది. నాని, వెంకటేష్, నితిన్ సినిమాలన్నీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు రెడీ అవుతుండగా…విశ్వక్ సేన్ సినిమా సెకండ్ వీక్ లో డిసెంబర్ 8న తెరపైకి రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *