ఉపేంద్ర సినిమాలన్నీ రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో కథ, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్… అన్నీ కొత్తగా ఉంటాయి. తన ప్రతి సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు సొసైటీకి కావాల్సిన ఒక మంచి అంశాన్ని కూడా ఆయన ప్రేక్షకులకు చెబుతుంటారు. ఆయన సినిమాలే కాదు టైటిల్స్ కూడా కొత్తగా ఉంటాయి. అసలే టైటిల్ లేకుండా సింబల్ తో సినమా చేసిన హీరో ఉపేంద్ర. ఇప్పుడు ఉపేంద్ర కొత్త సినిమా యూఐ కూడా ఇలాంటి కొత్తదనంతోనే తెరకెక్కుతోంది. ఇవాళ రిలీజైన యూఐ టీజర్ చూస్తే ఇదే విషయం తెలుస్తుంది. గతంలో ఈ హీరో చేసిన ఉపేంద్ర, ఉపేంద్ర 2 సినిమాలకు కొనసాగింపుగా యూఐ తెరకెక్కింది.

యూఐ మూవీ టీజర్ ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం చీకటి ఫ్రేమ్ తో రిలీజ్ చేశారు. ఆ చీకట్లో కొందరు శత్రువులు వేటాడుతున్న మాటలు వినిపించాయి. ఆ చీకట్లో ఎవరో ఉన్నారని ఏమాత్రం తెలిసినా చంపేస్తుంటారు. ఇలాంటి చీకటి నుంచి కేవలం మీ తెలివితేటలతోనే తప్పించుకోవాలి అని చెబుతూ ఇంట్రెస్టింగ్ గా టీజర్ సాగింది. చివరలో ఈ టీజర్ మీ ఊహ కోసమే అనే లైన్ డిస్ ప్లే చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న యూఐ సినిమా ఈ ఏడాది చివరలో థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *