పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఓజీ షూటింగ్ కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ సినిమా ముంబై షెడ్యూల్ ను తాజాగా టీమ్ ముగించారు. దాదాపు రెండు నెలల పాటు ఈ భారీ షెడ్యూల్ సాగింది. ఇందులో కొంత పార్ట్ పవన్ పాల్గొనగా…మరికొన్ని రోజులు పవన్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. ఓజీ షూటింగ్ లో ముంబై షెడ్యూల్ చాలా కీలకమైందని, ఇది సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన హంగ్రీ చీతా గ్లింప్స్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ ఓజీ టీమ్ కు కావాల్సినంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ హ్యాపీనెస్ లో షూటింగ్ మరింత కాన్ఫిడెన్స్ గా చేస్తున్నారట. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో యాక్షన్ ఎంటర్ టైనర్ దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఓజీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *