నాగ చైతన్య రెండో పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. నిన్నటి నుంచి ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరు ఎవరి కెరీర్ లో వారు ముందుకు వెళ్తున్నారు. స్టార్స్ గా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆ మధ్య హీరోయిన్ శోభితా ధూలిపాళ్లతో నాగ చైతన్య ముంబైలో కనిపించిన ఫొటోస్ వైరల్ కాగా..వారిద్దరూ లవ్ లో ఉన్నారనే టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే న్యూస్ మధ్య…ఆ పెళ్లి కూతురు శోభితనే కావొచ్చనే అంటున్నారు.

నాగ చైతన్య రెండో పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ప్రెషర్ ఉందనేది లేటెస్ట్ గాసిప్స్ సారాంశం. మళ్లీ పెళ్లికి నాగ చైతన్య సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియదు. నాగ చైతన్య గురించి ఇలాంటి న్యూస్ కొత్తకాదంటున్నారు మరికొందరు. కానీ తన కెరీర్ పై మాత్రం దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు చందూ మొండేటితో సినిమా చేస్తున్నారు. ఫిషర్ మేన్ లైఫ్ నేపథ్యంతో ఉండనున్న ఈ సినిమా ఈ దసరా నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *