కంటెంట్ లీక్స్ భారీ సినిమాలకు కొత్త సమస్యలు తెస్తున్నాయి. వంద కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న సినిమాల నుంచి కంటెంట్ లీక్ అవడం సమస్యలు సృష్టిస్తోంది. ఇటీవల రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి పాట లీక్ అవగా..ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా కల్కి 2898ఏడీ సినిమా నుంచి స్టిల్ బయటకు వచ్చింది. ఈ స్టిల్ బయటకు రావడంపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటోంది.

వారం రోజుల కిందట కల్కి నుంచి ప్రభాస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటో ఎలా లీకయ్యిందని మేకర్స్ ఆరా తీస్తే..అది వీఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి బయటకు వచ్చినట్లు తేలింది. దీంతో ఆ వీఎఫ్ఎక్స్ కంపెనీపై వైజయంతీ మూవీస్ కేసు ఫైల్ చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆ ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఎదురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *