హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో కీర్తి పెళ్లి జరగనుందని టాక్ చక్కర్లు కొడుతోంది. గతంలో ఒకసారి కీర్తి సురేష్ అనిరుధు కలిసి ఉన్న ఓ పార్టీలో కలిసి ఫొటోస్ బయటకు వచ్చాయి. అప్పటి నుంచి ఈ జంట మధ్య రూమర్స్ మొదలయ్యాయి. అయితే కీర్తి కుటుంబ సభ్యులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.

కీర్తి తండ్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ….కీర్తి పెళ్లి వార్తల్లో నిజం లేదు. గతంలోనూ మా అమ్మాయి పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. గతంలో కొందరు నటులతో కీర్తికి పెళ్లి సంబంధం కుదిరిందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇలాంటి విషయాలు ఉంటే మేమే చెబుతాం అంటూ ఆయన స్పందించారు.

రీసెంట్ గా దుబాయ్ లో సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసింది కీర్తి సురేష్. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది. కీర్తి సైమా కోసం బ్లూ డ్రెస్ లో రెడీ అయిన మేకోవర్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా పోస్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది కీర్తి. వీటిలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *