బాలీవుడ్ లో షారుఖ్ జవాన్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో 400 కోట్ల రూపాయల మార్క్ చేరుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం 11 రోజుల్లో ఈ మైల్ స్టోన్ అందుకుంది జవాన్. ఇదే ఫీట్ ను గతంలో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా 12 రోజుల్లో సాధించింది. 400 కోట్ల రూపాయల వసూళ్లకు గదర్ 2కు 12 రోజులు, బాహుబలి 2 సినిమాకు 15 రోజులు, కేజీఎఫ్ 2 సినిమాకు 23 రోజులు పట్టింది.

ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లోనూ జవాన్ జోరు కనిపిస్తోంది. రెండు రోజుల కిందటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల రూపాయల గ్రాస్ దాటేసింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ ట్రెండ్ చూస్తుంటే జవాన్ ఈజీగా 1000 కోట్ల రూపాయల మార్క్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2018 నుంచి సినిమా లేకుండా నాలుగేళ్లకు పైగా వెయిట్ చేసిన షారుఖ్ రైట్ టైమ్ లో బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. గత సినిమా పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టి, ఇప్పుడు జవాన్ తో దాన్ని దాటేసే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *