నిన్నటి నుంచి ఒక టీజర్ సోషల్ మీడియాలో అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. హర్ష సాయి అనే యంగ్ యాక్టర్ చేసిన మెగా లో డాన్ అనే సినిమాకు సంబంధించిన టీజర్ అది. కేజీఎఫ్ లాంటి బిల్డప్ తో ఈ టీజర్ ఉండటం ఆకట్టుకుంటోంది. ఇక మెగా లో డాన్ సినిమా ఫంక్షన్ లో హర్ష సాయి చేసిన సందడి కూడా వైరల్ అవుతోంది. స్టార్ హీరో మాట్లాడేప్పుడు అభిమానులు వచ్చినట్లు కొందరు స్టేజీ మీదకు వచ్చి హర్ష సాయితో షేక్ హ్యాండ్ చేయాలనుకోవడం బౌన్సర్స్ వారిని అడ్డుకోవడం..ఇదంతా స్ఫూఫ్ మూవీ చూసినట్లు అనిపిస్తోంది. ఇండస్ట్రీకి హర్ష సాయి మరో సంపూర్ణేష్ అవుతాడా? మెగా లో డాన్ ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం

ఒక పెద్ద స్తంభాలకు భారీ ఘంట ఒకటి కట్టి ఉంటుంది. అక్కడికి ఒక వ్యక్తితో కలిసి ఓ డాక్టర్ వస్తాడు. ఈ వ్యక్తి డాక్టర్ ను ఆ ఘంట ఏంటి డాక్టర్ అని అడగగానే…ప్రపంచంలోని క్రూరమైన శిక్షల్లో ఇదీ ఒకటి. అనేక లోహాలతో చేసిన ఆ ఘంట సౌండ్ వింటే చాలు చచ్చిపోతారని అంటాడు డాక్టర్. ఆ ఘంట కింద హీరో పడిపోయి ఉంటాడు. ఏలియన్ వచ్చి అతను చచ్చిపోయాడో లేదో చెక్ చేస్తాడు. ఆ ఘంటకు హీరోను వేలాడదీస్తూ బ్యాక్ గ్రౌండ్ లో సింహ కొరికితే ఎంత బలం పడుతుందో..అందకు వంద రెట్లు ప్రెజర్ మెగా లో డాన్ కొరికితే పడుతుందని అంటాడు. ఆ మెగా లో డాన్ ఏంటి…సముద్రాన్ని గెల్చిన ఆ వీరుడి కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఇలా భారీ బిల్డప్ లతో , బ్యాక్ గ్రౌండ్ డబ్బింగ్ తో వచ్చిన మెగా లో డాన్ టీజర్..ఒక భారీ సినిమా స్పూఫ్ లా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *