మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. మెగా156, మెగా 157 వర్కింగ్ టైటిల్ తో వీటిని పిలుస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో 157వ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. బింబిసార దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. చాలా విరామం తర్వాత చిరంజీవి ఈ సినిమాతో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. మెగా 157కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.

ఈ ప్రాజెక్ట్ నుంచి తాజా అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే…హీరోయిన్ అనుష్కను ఈ సినిమాకు తీసుకోవాలని అనుకుంటున్నారు. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకుంది అనుష్క. మెగాస్టార్ కు జోడిగా అనుష్క బాగుంటుందని అనుకుంటున్నారు. అనుష్కకు ఇలాంటి భారీ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది.

నిన్నటివరకు చిరుకు జోడిగా నయనతారను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపించింది. ఆమె కంటే అనుష్క అయితేనే తెలుగు ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది జనవరి నుంచి మెగా 157 మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *