హీరో కార్తికేయ గుమ్మకొండ రీసెంట్ గా బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించే టాక్ తెచ్చుకుంది. ఈ సెమీ హిట్ కార్తికేయ స్క్రిప్ట్ సెలెక్షన్ ను పూర్తిగా మార్చేసిందట. ఇన్నాళ్లూ యాక్షన్ మూవీస్ ఎక్కువగా చేసిన కార్తికేయ ..బెదురులంక మూవీలో కామెడీ వర్కవుట్ అయ్యేసరికి ఇక నా కొత్త సినిమాల స్క్రిప్ట్స్ కూడా హ్యూమరస్ గా ఉండాలని కోరుకుంటున్నాడట.

ఈ క్రమంలో ఇప్పుడు తను ఒప్పుకున్న ఓ మూడు సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు తాను కామెడీ మూవీస్ చేస్తేనే ఇష్టపడుతున్నారని, గతంలో చేసిన గుణ 369, రాజా విక్రమార్క వంటి యాక్షన్ మూవీస్ ఫ్లాప్ కావడంతో తనను యాక్షన్ హీరోగా చూడరనే కన్ క్లూజన్ కు కార్తికేయ వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా ప్రస్తుతం మేకింగ్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *