సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాలో తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నటనకు ఎన్టీఆర్ కు ఈ అవార్డ్ దక్కింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరిగిన సైమా ఈవెంట్ కు సౌత్ స్టేట్స్ నుంచి స్టార్స్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.

సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ తీసుకున్న ఎన్టీఆర్ తన అభిమానులను గుర్తు చేసుకున్నారు. కెరీర్ లో జయాపజయాలు ఎదురైనప్పుడు అభిమానులు ఒకేలా ప్రేమ చూపించారని, తను కష్టాల్లో అండగా నిలబడ్డారని ఎన్టీఆర్ అన్నారు. తన సక్సెస్ లో, సంతోషంలో వాళ్లూ ఆనందించారని ఎన్టీఆర్ చెప్పారు. సైమా వేదిక మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి చేసిన స్పీచ్ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. సైమా నుంచి తిరిగి వచ్చాక ఎన్టీఆర్ దేవర కొత్త షెడ్యూల్ లో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *