రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ నుంచి మంచి బీట్ సాంగ్ ఒకటి లీక్ అయ్యింది. జరగండి, జరగండి జరగండి…జాబిలమ్మ జాకెట్టు వేసుకొచ్చెనండి..అనే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు రామ్ చరణ్, కియారా గతంలో కలిసి నటించిన వినయ విధేయ రామ సినిమాలోని వీడియో క్లిప్స్ కలిపిన వీడియో గేమ చేంజర్ పాట అంటూ చక్కర్లు కొడుతోంది. ఇది అబద్ధం కాదు. ఈ పాట గేమ్ చేంజర్ లోనిదే అని కన్ఫర్మ్ కూడా అవుతోంది.

అయితే ఇది గేమ్ చేంజర్ సినిమాకు చేసిన కొన్ని డమ్మీ వెర్షన్స్ లో ఒక వెర్షన్ సాంగ్ గా మూవీ టీమ్ చెబుతున్నారు. అసలు పాట మా దగ్గరే సేఫ్ గా ఉంది అని వారంటున్నారు. అయితే డమ్మీ పాటయినా, ట్యూన్ లీక్ అయినట్లే కదా. ఇంత భారీ పాన్ ఇండియా సినిమా నుంచి పాట లీక్ కావడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా గేమ్ చేంజర్ ఉండబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *