పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ను ఆకర్షించిన డైరెక్టర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నేషనల్ అవార్డ్ విన్ అయిన ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్, గుర్తింపు అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయారు. ఈ నగరానికి ఏమైంది మూవీ తర్వాత టీవీ హోస్ట్ గా, ఆర్టిస్టుగా మారి సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.

నటుడిగా మీకు మాత్రమే చెప్తా, సీతారామం లాంటి ప్రాజెక్ట్స్ చేశాడు. ఈ క్రమంలో డైరెక్టర్ గా తన కొత్త ప్రాజెక్ట్ లు సెట్ చేసుకోలేకపోయాడు. డైరెక్షన్ నుంచి క్రమంగా డైవర్ట్ అయ్యాడు. వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ స్లాట్ తరుణ్ భాస్కర్ దే. తరుణ్ భాస్కర్ కీడా కోలా అనే ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఇలాంటి ఒక సినిమా ఉందని తెలుసు.

ఆ మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు గానీ ఒక ప్రయోగాత్మక సినిమా అని మాత్రం అర్థమైంది. ఇప్పుడీ సినిమా డేట్ ను అనౌన్స్ చేశారు. నవంబర్ 30న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. కీడా కోలాలో చైతన్య రావ్, బ్రహ్మానందంతో పాటు నాయుడు అనే క్యారెక్టర్ చేశాడు తరుణ్ భాస్కర్. కీడా కోలాతో ఈ డైరెక్టర్ ఏం చేస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *