తనతో కలిసి పనిచేస్తున్న టీమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కొక్కరి మారుస్తూ వస్తున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను పక్కన పెట్టిన త్రివిక్రమ్…ఇప్పుడు తన రాబోయే సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తప్పించినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ రాబోతున్న నాలుగో సినిమాకు రీసెంట్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. గీతా ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవాళ జవాన్ టీమ్ ను అభినందిస్తూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కు రెస్పాండ్ అయిన అనిరుధ్ థ్యాంక్స్ చెప్పాడు. అందుకు అల్లు అర్జున్ మంచి సాంగ్స్ ఇవ్వాలని అడగగా..రెడీ అంటూ అనిరుధ్ రిప్లై ఇచ్చాడు. వీళ్లిద్దరు మాట్లాడుకుంది తమ కొత్త ప్రాజెక్ట్ గురించే అని అర్థమవుతోంది.

తమన్ ఇప్పుడు ఫామ్ లో లేడు. ఆయన రీసెంట్ గా చేసిన బ్రో, స్కంధ పాటల్లో ఒక్కటి హిట్ అవలేదు.  భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్ కూడా సో ..సో గానే ఉంది. ఓజీ గ్లింప్స్ రిలీజైతే..ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నెటిజన్స్ ప్రూఫ్స్ తో సహా పోస్ట్ లు చేశారు. అరడజను సినిమాలు ఒకేసారి చేస్తుండటం వల్ల ఒత్తిడిలో తమన్ తన సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ కూడా తన కొత్త సినిమాకు తమన్ ను వద్దనుకున్నట్లు ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *