స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ మూవీ ఖుషి మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం నేపథ్యంలో ఉత్సాహంగా కనిపిస్తోంది సమంత. సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ గా ఉంటోంది. సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకుందీ హీరోయిన్. అయితే ఈ టైమ్ లో తన కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటోందట.

ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి సమంతకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాకు నాయికగా సమంతను కాంటాక్ట్ అయ్యారట. ఈ సినిమాను పవన్ కల్యాణ్ తో పంజా సినిమాను రూపొందించిన దర్శకుడు విష్ణు వర్థన్ తెరకెక్కించనున్నారు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తారట. ఉప్పు నిప్పులా ఉండే సల్మాన్ కరణ్ కలిసి ఓ సినిమా చేయడం బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో సమంత బాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. అక్కడ ఆమె పాపులారిటీ పెరిగింది. దీంతో సల్మాన్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సమంతకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ టాక్ నిజమైతే సమంత మరింత ఖుషి చేసుకోవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *