బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది షారుఖ్ ఖాన్ జవాన్. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో జవాన్ కు తన కాంప్లిమెంట్స్ ఇచ్చారు అల్లు అర్జున్. జవాన్ తో షారుఖ్ మాస్ అవతార్ లో తన స్వాగ్ చూపించారని షారుఖ్ కు ఇలాంటి బిగ్ సక్సెస్ రావాలని తామంతా కోరుకున్నామని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు స్పందించిన షారుఖ్ ఖాన్..అల్లు అర్జున్ ప్రశంసలు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. పుష్ప సినిమాను మూడుసార్లు చూశానని, అల్లు అర్జున్ నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. వీలైతే పర్సనల్ గా అల్లు అర్జున్ ను వచ్చి కలుస్తానని షారుఖ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ , షారుఖ్ మధ్య జరిగిన ఈ ట్వీట్, రిప్లైలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *