పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఉస్తాద్ సెట్ లో పవన్ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఉస్తాద్ ఆన్ లొకేషన్ స్టిల్స్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఈ ఫొటోస్ ల్ యూనిఫార్మ్ వేసుకుని స్టైలిష్ గా కనిపిస్తున్న పవన్ ను చూడొచ్చు. దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కు సీన్ వివరించడం ఫొటోస్ లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ పవన్ పాల్గొనే కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారు.

గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ హిట్ మూవీ తెరీ రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఉస్తాద్ ..ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *