నవీన్ పోలిశెట్టి, అనుష్క హీరో హీరోయిన్స్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఇటీవల రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో 2 మిలియన్ డాలర్స్ మార్క్ వైపు పరుగులు పెడుతోంది. ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ, తామెంతో ఎంజాయ్ చేశామంటూ అప్రిషియేట్ చేశారు.

ఈ సూపర్ హిట్ సినిమా తాజాగా మలయాళ రిలీజ్ కు రెడీ అవుతోంది. రేపటి నుంచి కేరళలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మూవీ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగులో మంచి టాక్ రావడంతో మలయాళంలో ఓపెనింగ్స్ బాగుంటాయని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అనుష్కకు మలయాళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అలాగే జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి కూడా మలయాళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇలాంటి కూల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే మలయాళ ఆడియెన్స్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి మంచి సక్సెస్ అందించే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *