పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా సలార్ రిలీజ్ డేట్ అప్ డేట్ చెప్పింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్. ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. సలార్ వాయిదా పడిందనే వార్తల నేపథ్యంలో ఫస్ట్ టైమ్ హోంబలే ఫిలింస్ సంస్థ స్పందించింది. అనివార్య కారణాల వల్ల సలార్ వాయిదా వేస్తున్నట్లు ఈ అప్ డేట్ లో తెలిపింది.

సలార్ ప్రొడ్యూసర్స్ ప్రకటన చూస్తే – సలార్ మూవీ మీద మీరు చూపిస్తున్న ఆసక్తికి థాంక్స్. అనివార్య కారణాల వల్ల మూవీ రిలీజ్ ను వాయిదా వేయాల్సివస్తోంది. ఒక గొప్ప సినిమాను తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నంలోనే సలార్ విడుదల తేదీని వాయిదా వేశాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు మా మూవీ టీమ్ నిరంతరం శ్రమిస్తోంది. ప్రస్తుతం సలార్ కు తుది మెరుగులు దిద్దుతున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. అని పేర్కొన్నారు

రెండు భాగాల సలార్ మూవీలో మొదటిది సలార్ పార్ట్ 1 సీజ్ ‌ఫైర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *