టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

కో ప్రొడ్యూసర్ శివ మాట్లాడుతూ – కత్తి మహేశ్ ద్వారా అభయ్ నవీన్ పరిచయం అయ్యాడు. అతను చెప్పిన కథ విన్నాక…ఒక యూనిక్ పాయింట్ ను సినిమాటిక్ వేలో బాగా కథ రాశాడు అనిపించింది. కానీ మేకింగ్ మేము అనుకున్నంత ఈజీగా కాలేదు. మంచి సినిమా చేశామని చెప్పగలను. మీరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు. హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ – నా వెనక ప్రియదర్శి, తిరువీర్, తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పవన్ సాధినేని లాంటి వాళ్లంతా ఉన్నారనే ధైర్యంతో రామన్న యూత్ స్టార్ట్ చేశాను. నా టీమ్ నాకు పెద్ద బలం. ముందు సినిమా చేయి అన్నా అనేంత సపోర్ట్ ఇచ్చారు. విశ్వక్ కు థాంక్స్ చెబుతున్నా. మా సినిమాకు ఇలా ప్రీ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తెలియదు. మంచి కథ ఉంటే సినిమా తప్పకుండా చూస్తారు. ఈ నెల 15 నా లైఫ్ లో స్పెషల్ డే. ఆ రోజును మా నాన్నకు అంకితమిస్తా. మా సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ – తన సినిమాను రిలీజ్ వరకు తెచ్చుకోవడమే అభయ్ ఫస్ట్ సక్సెస్. ఈ సినిమాకు అతనికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. అభయ్ నాకు కూడా కథ చెప్తా అన్నాడు. ఈ నెల 15న లాంగ్ వీకెండ్ వస్తోంది. సినిమాను థియేటర్ లో చూడండి. ఎంకరేజ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే అభయ్ రామన్న యూత్ లాంటి మంచి సినిమాలు మరిన్ని చేస్తాడు. అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – రామన్న యూత్ కథ చెప్పాడు. తను సినిమా సినిమా చేస్తున్నప్పుడు ఎవరైతే తనతో ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అందరికీ అవకాశం ఇచ్చాడు. నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. తాగుబోతు రమేష్ కు మంచి క్యారెక్టర్ ఉంది. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలకు తక్కువ, మరికొన్ని సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయి. కానీ ఈ సినిమాను మీరు తప్పక చూడాలి. మంచి కథ ఉంది. ఎమోషన్ ఉంది. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది. అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదు అని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్ నుమా దాస్ వంటి ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలా మంది కానీ..ఆ సినిమా వెనక పనిచేస్తున్న వాళ్లు ఎంత టాలెంటెడ్ అనేది చూస్తే అది సినిమాకు అసలైన స్ట్రెంత్ అని నమ్ముతాను. రామన్న యూత్ కు అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నా. తరుణ్ భాస్కర్ ఏడాదిన్నర క్రితమే ఈ కథ గురించి చెప్పాడు చాలా బాగుందని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. హోల్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ నెల 15న రామన్న యూత్ సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *