తన్విక జశ్విక క్రియేషన్స్ పతాకం పై అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా చందాన కట్ట దర్శకత్వం వహించగా దివ్యా భావన దర్శకత్వం వహించిన చిత్రం “ఓ సాథియా”. ఈ చిత్రం జులై 7వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ ని ఆకర్శించింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్ట్రీమింగ్ అవుతుంటున్న మొదటి రోజు నుంచే ఓ టి టి ప్రేక్షకులు ఓ సాథియా చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికి 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ తో అన్ స్టాపబుల్ గా నిలించింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ సంపాదించుకుంది.

ఓ సాథియా ఒక అందమైన ఎమోషనల్ ప్రేమ కథ. ప్రతి ఒక్కరికి నచ్చే చిత్రం. యూత్ కి ఫామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. అందుకే అమెజాన్ ప్రైమ్ లో మంచి వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉంది. మా ఓ సాథియా చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో మీకు నచ్చిన భాషలో వీక్షించండి అని దర్శక నిర్మాతలు కోరుతున్నారు.

ఈ చిత్రానికి ఈజే వేణు కెమెరామెన్‌గా పని చేశారు. విన్ను సంగీతాన్ని అందించారు. అర్యాన్, దీపు ఈ చిత్రానికి కథను అందించారు. కార్తిక్ కట్స్ ఎడిటర్‌గా పని చేశారు. భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసల సాహిత్యాన్ని సమకూర్చారు. రఘు మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, యానీ మాస్టర్లు కొరియోగఫ్రీ చేశారు. వంశీ కృష్ణ జూలూరు లైన్ ప్రొడ్యూసర్ కాగా.. చంద్ర తివారి ఆవుల, కేశవ్ సాయి కృష్ణ గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *