మహేశ్ బాబుకు ఓ హిట్ సినిమా చేసి పెట్టాలని ఉందని అన్నారు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ జే సూర్య. మహేశ్ కు గతంలో ఓ ఫ్లాప్ ఇచ్చాను కాబట్టి హిట్ సినిమా చేసి దాన్ని సరిచేస్తానంటున్నాడాయన. ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడిన ఎస్ జే సూర్య…ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ డైరెక్టర్ మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతోంది.

2004లో మహేశ్ బాబు హీరోగా నాని సినిమాను తెరకెక్కించాడు ఎస్ జే సూర్య. పవన్ తో ఖుషి సినిమా చేసిన డైరెక్టర్ గా ఎస్ జే సూర్య అంటే అప్పట్లో మన స్టార్ హీరోలకు క్రేజ్ ఉండేది. మహేశ్ కు మరీ ఎక్కువగా ఎస్ జే సూర్య ఇష్టం. వాస్తవానికి ఖుషి సినిమా మహేశ్ తోనే చేయాలని ఎస్ జే సూర్య అనుకున్నాడట. అప్పటికే మహేశ్ ఒక్కడు లాంటి మాస్ మూవీ చేసి ఉన్నాడు కాబట్టి నాని సినిమా కంటెంట్ ఆయన ఇమేజ్ కు సెట్ కాలేదు. చిన్న పిల్లాడిగా మహేశ్ నటించడాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోయారు. దీంతో నాని సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆ తర్వాత మహేశ్ స్పైడర్ మూవీలో విలన్ గా నటించాడు ఎస్ జే సూర్య. మహేశ్ తో అతనికి మంచి రిలేషన్ ఉంది. ఈ స్నేహంతోనే మహేశ్ తో హిట్ సినిమా చేస్తానని ఎస్ జే సూర్య చెప్పి ఉంటాడు. తమిళంలో విజయ్, అజిత్ తో హిట్ సినిమాలు చేశాడు ఎస్ జే సూర్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మహేశ్ తో మూవీ చేయడం కుదురుతుందా అనేది డౌటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *