డిఫరెంట్ మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ ఉపేంద్ర. ఒకప్పుడు ఆయన సినిమాలు సౌత్ మొత్తం మాస్ ఆడియెన్స్ ను ఊపేశాయి. ఈ కన్నడ స్టార్ నటిస్తున్న కొత్త సినిమా యుఐ. గతంలో నేను అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర అనే సినిమాను, తర్వాత నువ్వు అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర 2 సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు ఉపేంద్ర. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ కలిపి యూఐ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమ అనౌన్స్ మెంట్ ను డిఫరెంట్ గా చేశారు ఉపేంద్ర. ఒక స్పెషల్ వీడియో ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ వీడియోలో ఉపేంద్ర ఇంటి దగ్గర అభిమానులు తమకు యూఐ సినిమా నుంచి టీజర్ గానీ ట్రైలర్ గానీ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తారు. డైరెక్ట్ గా సినిమానే చూడండి అని ఉపేంద్ర చెప్పగానే పక్కనున్న వ్యక్తి ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూసే ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తున్నారని అంటాడు. ఇతనెవరు అని అడగగా..ప్రొడ్యూసర్ బావమరిది అంటాడు. అతన్ని వెళ్లిపొమ్మని తిట్టిన ఉపేంద్ర. ఈ నెల 18 టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటిస్తాడు. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంది.

లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న యూఐ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ ఏడాది చివరకు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. యూఐ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *