ఎవరైనా ట్వీట్ చేస్తే కాసేపటికో, రేపటికో రిప్లై ఇస్తారు. కానీ హీరోయిన్ త్రిష మాత్రం పదేళ్ల తర్వాత రిప్లై ఇచ్చింది. ఆమె చేసిన ఈ రీట్వీట్ వైరల్ అవుతోంది. 2013, జూలైలో దర్శకుడు సెల్వరాఘవన్ ట్వీట్ చేస్తూ…ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాను చాలా రోజుల తర్వాత చూశాను. త్రిష, వెంకటేష్ తో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయడంలో తప్పు లేదనకుంటా. అని పేర్కొన్నారు. ఇందులో త్రిషను ట్యాగ్ చేశారు.

దర్శకుడు సెల్వరాఘవన్ ట్వీట్ కు పదేళ్ల తర్వాత రిప్లై ఇచ్చింది త్రిష. ఐ యామ్ రెడీ అంటూ రీట్వీట్ చేసింది. ఇప్పటికి ఆమెకు దర్శకుడి ట్వీట్ గుర్తుకురావడం ఆశ్చర్యంగా ఉంది. ఇక 2007లో త్రిష, వెంకటేష్ జంటగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. తెలుగు క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించిందని రివ్యూస్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *