ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారారు లోకేష్ కనకరాజ్. ఈ దర్శకుడు రజనీకాంత్ తో సినిమా చేస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై తాజా అప్ డేట్ వచ్చింది. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ సినిమా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. రజనీకాంత్ నటిస్తున్న 171వ చిత్రమిది.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ బ్లడ్ షెడ్ తో డిజైన్ చేయడంతో ఈ కథలో యాక్షన్ భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ గత చిత్రాలన్నింటిలోనూ యాక్షన్, వయలెన్స్ మెయిన్ పాయింట్ అయ్యింది. రజనీ 171 సినిమా కథా నేపథ్యం కూడా అలాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ అన్భు అరీవు రూపొందించనున్నారు. మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. విజయ్ తో లోకేష్ రూపొందించిన లియో మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. రజనీ కాంత్ రీసెంట్ మూవీ జైలర్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈ క్రేజీ కాంబో మూవీ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *