యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా యూఎస్ లో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. షారుఖ్ జవాన్ తో పాటు థియేటర్స్ లోకి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ..జవాన్ క్రేజ్ ను తట్టుకుంటూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ సాధిస్తోంది. హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు తర్వాత యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ సాధించిన మూడో సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కావడం విశేషం.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ని ఎన్ఆర్ఐ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. రిలీజ్ డే నుంచి హీరో నవీన్ పోలిశెట్టి యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న ప్రమోషనల్ టూర్ కూడా అక్కడి వారిని సినిమా వైపు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి టూర్ బే ఏరియా కాలిఫోర్నియాకు చేరుకుంది. ఇక్కడే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా వన్ మిలియన్ మార్క్ సెలబ్రేషన్ చేసుకుందామంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *